![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -470 లో... కళ్యాణ్ అప్పు పైన ప్రేమని ఒక పేపర్ లో రాస్తాడు. నన్ను కలవడానికి ఇష్టపడడం లేదు.. అలాంటిది తను నా ఇష్టమని చెప్తే ఎలా వింటుందని రాసి ఆ పేపర్ ని విసిరేస్తాడు. అది రాజ్ చూస్తాడు. ఆ పేపర్ తీసుకొని చదువుతాడు. అందులో అప్పు పైన కళ్యాణ్ పెంచుకున్న ప్రేమని చదివి రాజ్ షాక్ అవుతాడు. మనసులో ఇంత ప్రేమని పెట్టుకొని స్నేహమని అంటున్నావా.. నీ ప్రేమని బయటకు తీస్తా.. నీ ప్రేమని గెలిపిస్తానని రాజ్ అనుకుంటాడు.
మరొకవైపు కనకం, కృష్ణమూర్తి లతో అప్పుకి మంచి సంబంధం వచ్చింది.. రేపు వాళ్ళు అప్పుని చూసుకోవడానికి వస్తున్నారని కనకం అనగానే.. మరి ఆ విషయం అప్పు కి చెప్పావా అనే లోపే అప్పుడే అప్పు వస్తుంది. ఇన్ని రోజులు నా నిర్ణయం అంటూ బాధపెట్టాను. ఇక మీకు నచ్చింది చెయ్యండి. మీరైన హ్యాపీగా ఉంటారని అప్పు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరకి కావ్య వెళ్ళి మాట్లాడుతుంది. పిల్లలు పుట్టాక వారికి ఏ పేరు పెట్టాలని రాజ్ ని కావ్య అడుగగా.. అప్పుడే అక్కడికి వెళ్ళావా అంటూ రాజ్ అంటాడు. అప్పుడే కావ్యకి కనకం ఫోన్ చేసి.. అప్పు పెళ్లి చూపుల సంగతి చెప్తుంది. దాంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతు.. ఆ విషయం రాజ్ కి చెప్తుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. ఈ విషయం అడ్డుపెట్టుకొని కళ్యాణ్ మనసులో మాటని బయటపెట్టాలని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు అప్పు దగ్గరికి బంటి వెళ్లి.. నువ్వు కళ్యాణ్ ని పెళ్లి చేసుకోమని చెప్తాడు. అది అవ్వదు.. ఇప్పటికే నా వల్ల అమ్మ నాన్నలు చాలా బాధపడ్డారని అప్పు అంటుంది.
కాసేపటికి కావ్య, స్వప్న ఇద్దరు కలిసి వాళ్ళ పుట్టింటికి వెళ్తారు. అక్కాచెల్లెలు కలిసి రావడం చూసిన కనకం, కృష్ణమూర్తి లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత వెళ్లి అప్పుతో మాట్లాడుతారు. మరొకవైపు కళ్యాణ్ దగ్గరికి రాజ్ వచ్చి.. ఇక అప్పు జీవితం సెట్ అయినట్లే అంటు, అసలు విషయం చెప్పకుండా కళ్యాణ్ మనసులో మాట బయటపెట్టాలని చూస్తాడు. ఈ రోజు అప్పు పెళ్లిచూపులు ఇక నువ్వు కోరుకున్నట్లు అప్పు జీవితం బాగుంటుందని రాజ్ అనగానే.. కళ్యాణ్ తనలో తానే బాధపడతాడు. మరొకవైపు స్వప్న కావ్యలు అప్పుని రెడీ చేస్తారు. తరువాయి భాగంలో అప్పుని చూడడానికి వచ్చిన అబ్బాయి.. అప్పు నచ్చిందని చెప్తాడు. కట్నం కూడా అవసరం లేదని అతని పేరెంట్స్ చెప్తారు. ఆ తర్వాత కావ్య, స్వప్నలు అప్పు దగ్గరికి వచ్చి.. ఏంటి అలా ఉన్నావ్? అబ్బాయి నచ్చలేదా అని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |